Showing posts with label Annamacharya. Show all posts
Showing posts with label Annamacharya. Show all posts

Sunday, 9 April 2023

Muddugare Yashoda ముద్దుగారే యశోద - Annamacharya

Song: Muddugare Yashoda
Ragam: kurinji
Composer: Sri Tallapaka Annamacharya
Language: Telugu

Telugu Lyrics - English Transliteration - word-to-word meaning - Translation in English & Telugu

Telugu Lyrics:

పల్లవి:
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు

చరణం 1:
అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడపచ్చబూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుడు

చరణం 2:
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

చరణం 3:
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధిలోన బాయని దివ్యరత్నము
బాలునివలె దిరిగీ పద్మనాభుడు

English Transliteration: 

muddugārē yaśōda muṅgiṭi mutyamu vīḍu
diddarāni mahimala dēvakī sutuḍu

anta ninta golletala aracēti māṇikamu
panta māḍē kaṃsuni pāli vajramu
kāntula mūḍu lōkāla garuḍa pacca būsa
centala mālō nunna cinni kr̥ṣṇuḍu

ratikēḷi rukmiṇiki raṅgu mōvi pagaḍamu
miti gōvardhanapu gōmēdhikamu
satamai śaṅkha cakrāla sandula vaiḍūryamu
gatiyai mammu gācēṭi kamalākṣuḍu

kāḷiṅguni talalapai gappina puṣyarāgamu
yēlēṭi śrī vēṅkaṭādri yindranīlamu
pāla jalanidhi lōna bāyani divya ratnamu
bālunivale dirigī padmanābhuḍu

Word-to-word Meaning: 

muddugārē = outpouring cuteness; yaśōda = Mother Yasoda; muṁgiṭi  = in front of; mutyamu = like pearl; vīḍu = he is (Krishna); diddarāni = irreplicable/inconceivable; mahimala = glorious acts; dēvakī sutuḍu = son of Devaki; 

anta ninta = in every (both yonger and elder); golletala = cowherd girls; aracēti = in the palm of the hand; māṇikyamu = like a ruby; panta māḍē = showing enmity;  kaṁsuni pāli = to the Kansa; vajramu = like a diamond; kāntula = brilliantly shining;  mūḍu lōkāla = in three worlds; garuḍapacca pūsa = like an emerald; centala = very intimate; mālō nunna = staying among us; cinni kr̥ṣṇuḍu = little Krishna; 

ratikēḷi = amorous sports; rukmiṇiki = to the Rukhmini Devi; raṅgu = colorful; mōvi = lips; pagaḍamu = like coral; miti = in short time/effortlessly; gōvardhanapu = to the Govardhana hill; gōmēdhikamu = like a Hessonite; satamai = always; śaṅkhacakrāla sandula = between conch & disc; vaiḍūryamu = like cat's eye; gatiyai = our shelter; mammu gācēṭi = protecting us; kamalākṣuḍu = lotus-eyed lord; 

kāḷiṅguni = Kaliya snake; talalapai = on this hoods; gappina = covered; puṣyarāgamu = yellow sapphire; yēlēṭi = ruling over; śrī vēṅkaṭādri = Venkatadri mountain ranges; yindranīlamu = like blue sapphire; pāla jalanidhi = inside milk ocean lōna; bāyani = never lost, eternally; divya ratnamu = divine gemstone; bālunivale = like a small boy; dirigī = wandering; padmanābhuḍu = lotus sprouts from His navel; 

Translation (English & Telugu): 

దేవకి ప్రసవించిన బిడ్డడగు కృష్ణుని మహిమలు తెలియరానివి, వర్ణించుటకు, తెలుపుటకు సాధ్యము కానివి. ఇతడు యశోద ముంగిట ముద్దుగారుచున్న ముత్యము.

The deeds (Lilas) of Mother Devaki's child, Sri Krishna are beyond comprehension and explanation. In front of Mother Yasodha, he is like a shining pearl, radiating sweetness.

వయస్సులో పెద్దవారు, చిన్నవారు అయిన గోపికల అరచేతిలోని మాణిక్యము కృష్ణుడు. కృష్ణునిపై పగబట్టి, అతనిని చంపుటకై పంతముపూనిన కంసుని పాలి వజ్రమీతడు. మూడు లోకములకు తన కాంతులను పంచిపెట్టు లేత ఆకుపచ్చల పూస కృష్ణుడు. మాకు సమీపముగనే, మాలోననే చిన్నికృష్ణు చున్నాడు.

To all the Gopis, both younger and elder in age, Krishna appears as a brilliant ruby in their palms. He is like a diamond to his foe Kamsa, who wants to annihilate Him. He illuminates the three worlds like an emerald while remaining readily accessible to us as a Baby Krishna.  

కృష్ణుడు రుక్మిణీదేవితో రతికేళిని నెఱపునపుడు, ఆమె పాలిట పగడము వంటి రంగు పెదవి. పరిమిత కాలవ్యవధిలోనే గోవర్ధనగిరి నెత్తి, దాని పాలిట గోమేధిక మయ్యెను. రెండు భుజములలో శంఖ చక్రములను సదా ధరించి, ఆ రెంటి నడుమ కంఠహారమున వైడూర్యము గలవాడు కృష్ణుడు. మనలకు అండయై గాచునట్టి కమలముల వంటి కన్నులు గలవాడు.

To His beloved consort Rukhmini, He is like a coral-like lip when engaged in amorous pastimes. He appears like a glowing hessonite when he effortlessly lifted the Govardhana mountain. He is like a Kaustubha gem between the Conch and Club, which are mounted eternally on His two shoulders. The lotus-eyed Lord is our only shelter.

కాళీయుని తలలపై కప్పిన పుష్యరాగము స్వామి. ఎల్లరిని ఏలునట్టి శ్రీవేంకటాద్రిపై నిలిచిన ఇంద్రనీలము స్వామి. పాలసముద్రములోన విడువని దివ్య రత్నము స్వామి. ఇతడు పద్యము నాభియందు గలవాడు. ఇట్టి స్వామి గోకులమున బాలుని వలె తిరుగుచున్నాడు.

Covering the hoods of the serpent Kaliya, He is radiant like a yellow sapphire. Like blue sapphire, he shines on the Venkatadri hills which are his eternal residence. He is the glowing divine gem in the milk ocean and From his navel emerges the celestial lotus. He is ambling around on the streets of Gokula like a young boy. 

Muddugare Yashoda ముద్దుగారే యశోద - Annamacharya

Song: Muddugare Yashoda Ragam: kurinji Composer: Sri Tallapaka Annamacharya Language: Telugu Telugu Lyrics - English Transliteration - word-...